కంటిచూపుకందని వస్తువును చూడాలంటే మామూలుగా అయితే ఏం చేస్తాం? మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. మరి గ్రహాలని చూడాలంటే?? సింపుల్ టెలీస్కోప్ నుంచి చూస్తాం. ఇవేకదా ఇప్పటిదాకా ఉన్న ఆన్సర్లు.
మరి ఒక క్లాస్ రూంలోకే ఆ గ్రహాలని తెచ్చి చూపిస్తే? మన బాడీలోపలికి వెళ్లిపోయి జీవకణాల్లో ఉండే మైటో కాండ్రియాలని కూడా క్లియర్ గా చూడగలిగితే!? జియాలజీ, ఆస్ట్రానమీ స్టూడెంట్స్‌కి భూమిలోపలి పొరల్లో ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ద్వారా చూపించగలిగితే ఎలా ఉంటుంది?! ఊహించటానికే భలే ఉంది.
జియో ఎక్స్‌ప్లోరర్
వాషింగ్టన్ యూనివర్సిటీ లో ఒక టీమ్ కూడా ఇక్కడ చెప్పుకున్నట్టే ఆలోచించారు. యూనివర్సిటీలోని ‘మార్టిన్ ప్రాట్’ ఆయన టీమ్‌తో కలిసి కొన్ని యాప్‌లు తయారు చేశాడు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ‘జియో ఎక్స్‌ప్లోరర్’ పేరుతో వచ్చిన ఈ యాప్స్ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ అవుతాయి. ఈ యాప్‌తో మెటల్స్, మినరల్స్‌లో ఉండే సెల్స్ అన్నీ కలిసి పదార్థం ఎలా తయారవుతుంది? రాళ్లూ, కొండలూ భూమ్మీద ఎలా ఏర్పడ్దాయి? లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. మనుషుల్లో, వృక్షాల్లో ఉండే జీవకణాలని స్పష్టంగా త్రీడీలో చూడొచ్చు. జియో ఎక్స్‌ప్లోరర్ ఇప్పటికే ప్లేస్టోర్స్ లో అందుబాటులో ఉంది. అయితే దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు.
హోలోలెన్స్
ఈ టీమ్ తయారు చేసిన యాప్స్ స్మార్ట్ ఫోన్లకే కాదు మైక్రోసాఫ్ట్ ‘హోలోలెన్స్’ లాంటి ఏఆర్ డివైజ్‌ల్లో చూడొచ్చు. టీవీలో, కంప్యూటర్ స్క్రీన్ మీదనో చూసినట్టు కాకుండా ఆ ‘సెల్’ ఎదురుగా ఉన్నట్టే అన్నివైపులనుంచీ చుట్టూ తిరిగి చూడొచ్చు. నిజానికి వర్చువల్ రియాలిటీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన ఆగ్మెంటెడ్ రియాలిటీ టీచర్‌కీ, స్టూడెంట్‌కీ మధ్య ఉండే చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్‌ని కూడా ఫిల్ చేస్తుంది అంటున్నాడు మార్టిన్ ప్రాట్.
కణాలని కళ్ళకి చూపిస్తూ
ఇప్పటికైతే ఆగ్మెంటెడ్ రియాలిటీ సినిమాలు, వీడియో గేమ్స్ వరకే ఎక్కువగా వాడుతున్నారు. కానీ దీన్ని ఎడ్యుకేషన్‌లోకి తీసుకురాగలిగితే ఒక గ్రహాన్ని క్లాస్‌రూమ్‌లోకి తీసుకొచ్చి మరీ స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా వివరంగా చెప్పొచ్చు. మనిషిలో ఉండే ప్రతీ కణాన్ని, లోపలి బాడీ ఆర్గాన్స్‌ని కళ్ళకి చూపిస్తూ పాఠం చెప్పొచ్చు. ఈ టెక్నాలజీని అంతకుముందు ఫొటోగ్రామెట్రీలో వాడేవాళ్లు. అయితే జియాలజీ, హ్యూమన్ అనాటమీ, న్యూక్లియర్ టెక్నాలజీలో దీన్ని వాడటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందంటున్నారు ప్రొఫెసర్లు.
త్రీ డైమెన్షన్ డేటా
ఇప్పటికే ఈ కాన్సెప్ట్ కోసం వర్క్ మొదలైపోయింది. నాసాకు చెందిన మార్స్ రోవర్ టెక్నాలజీని తీసుకొని, త్రీడి విజువలైజేషన్‌తో మార్స్ గ్రహాన్ని డిజిటల్ రూపంలో తయారుచేస్తున్నారు. ఇక మార్టిన్ ప్రాట్ టీమ్ అయితే మార్స్ గ్రహాన్ని దగ్గరగా చూడగలిగేంత ముందడుగు వేసింది. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఇప్పటికే టెస్ట్ దశలో చూసిన స్టూడెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారట. మ్యాపుల్లో, ల్యాప్‌టాప్‌ల్లో ఫొటోలు చూసే పనిలేకుండా ఇలా త్రీ డైమెన్షన్‌లో డేటాను చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు మార్టిన్ ప్రాట్ టీమ్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రొటీన్ మోడల్స్, ఆర్కియాలాజికల్ సబ్జెక్ట్స్‌ని ఈ ఫార్మాట్‌లోకి మార్చే ప్రాజెక్ట్ మొదలు పెట్టమని అడుగుతున్నాయి.
ఆగ్మెంటె డ్ రియాలిటీ అంటే..
ఈ టెక్నాలజీ ఇప్పటికే అద్భుతమైన క్రియేషన్ అనిపించుకుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫోన్ కెమెరా తో చూస్తూ గది కొలతల్ని తీసుకోవచ్చు, మనం ఉన్నచోటే నిలబడి 3డీలో బొమ్మలని క్రియేట్ చెయ్యొచ్చు. మన పక్కనే హాలో గ్రామ్స్ ని తయారుచేసుకొని చూడొచ్చు . ఫోన్ తోనేఅన్ ని వస్తువుల కొలతలనీ కచ్చితంగా తీసుకోవచ్చు. ‘పొకెమాన్ గో’ గేమ్ తో ఈ టెక్నాలజీ చాలామందికి దగ్గరైంది. ఇప్పుడిప్పుడే గేమింగ్ ని దాటి మిగతా సర్కి ల్స్ లోకి కూడా దీన్ని వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐటీ టైకూన్స్ గూగుల్, యాపిల్ సంస్థలు ఏఆర్ ని వాడుకుని చాలా రకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఆగ్మెంటె డ్ రియాలిటీ చేసే అద్భుతాలు మరిన్ని చూడబోతున్నాం .