ఏనుమాముల మార్కెట్లో రైతుల ఆందోళన

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చీ,పత్తి  రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు సిండికేట్ గా మారడంతో ధర విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిర్చి, పత్తి కాంటాలు నిలిచిపోయాయి. అయితే ఖమ్మం మార్కెట్ తరహాలో కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.