ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డుగా ప్రసిద్ధి గాంచిన గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర పతనమైంది.. మిర్చి ధరలు భారీగా తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి సహకరించినా పండించిన పంటకు ధర లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత ఏడాది కన్నా పంటదిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడం రైతన్నల పాలిట శాపంగా మారింది.
మరీ ముఖ్యంగా గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గుంటూరు , కృష్ణా, ప్రకాశంజిల్లాలలో మిర్చి పంట సాగు ఎక్కువగా ఉండేది...కానీ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డ్ స్థాపించి ముఖ్యమైన పంటగా మిర్చికి ప్రాధాన్యతనివ్వడం కూడా ధరల పతనానికి మరో కారణమని చెప్పచ్చు.
ALSO READ | తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
మరో పక్క కూలీల రేట్లు విపరీతంగా పెరగడం, ఎరువులు రేట్లు ఆకాశంలో ఉండటంతో రైతుకు పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది.
మిర్చిని వాహనాలలో మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.ఇది చాలదన్నట్లు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ సైతం మిర్చి పంటను పండించడానికి తహతహలాడుతున్న క్రమంలో గుంటూరు మిర్చి ధర పతనానికి మరో కారణం.