మార్కెట్లో నిలిచిపోయిన మిర్చి కొనుగోళ్లు

కరోనా ప్రభావంతో మార్కెట్ లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు మిర్చిని ఇళ్లలో నిల్వ చేసుకోలేక మార్కెట్ కు వాహనాల్లో తీసుకుని వచ్చారు. వాహనాలలో తీసుకుని వచ్చిన 70 వేల మిర్చి బస్తాలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయించారు మార్కెట్ అధికారులు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండే కాక.. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి 70 నుండి 80 వేల బస్తాలు తీసుకుని వచ్చార‌ని తెలిపారు అధికారులు. రైతుల వద్ద ఉన్న సరుకులను ఎవరు తీసుకుని వచ్చి తమకు సమాచారం అందిస్తే ..కోల్డ్ స్టోరేజీలో పెట్టిస్తామని చెప్పారు.

వరంగల్ మార్కెట్ పరిధిలో 25 కోల్డ్ స్టోరేజ్ లలో లక్షల వరకు మిర్చి బస్తాలను నిల్వ చేయుటకు అవకాశం ఉందని తెలిపారు. రైతులూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బందు పథకంను ఉపయోగించుకోవాలని కోరారు. రైతులకు డబ్బులు అవసరం ఉంటే సరుకులను ధరలో 75% వరకు రెండు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు పొందవచ్చని చెబుతున్నారు మార్కెట్ యార్డు అధికారులు.