ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. 65 వేల బస్తాలు వచ్చింది. జెండా పాట క్వింటా మిర్చి 14,025 ధర పలికింది. మిర్చి గ్రేడ్ ను బట్టి రూ. వెయ్యి తేడాతో వ్యాపారులు కొనుగోలు చేశారు. విదేశీ ఎగుమతులు లేకపోవడంతో ట్రేడర్లు రేటు తక్కువ చేశారు. దీంతో యార్డుకు మిర్చి తెచ్చిన రైతులు వచ్చిందే ధర అనుకుని వెనక్కు తీసుకెళ్లలేక అమ్ముకుని వెళ్తున్నారు.
మరోవైపు మార్కెట్ యార్డులో స్వీపర్లు, చాటా వాలా మహిళలు కొనుగోళ్లు కాకముందే రైతు బస్తాల్లోని మిర్చిని కొల్లగొలుడుతున్నారు. గేటు బయట మారు బేరగాళ్ల షాపుల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. యార్డులో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇన్ చార్జ్ లు దోపిడీ ని కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక మహిళ బస్తాల్లోంచి దొంగిలించిన మిర్చిని బయటకు తీసుకెళ్తున్న వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. – ఖమ్మం టౌన్, వెలుగు