Mirna Menon: నా సామి రంగ..అంజిగాడి ప్రాణం వచ్చేసింది

Mirna Menon: నా సామి రంగ..అంజిగాడి ప్రాణం వచ్చేసింది

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ(Naa Saami Ranga). ఆషికా రంగనాథ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డాన్స్ మాస్టర్ విజయ్‌ బన్నీ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ అండ్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

ఈ క్రేజీ రొమాంటిక్ సినిమాలో అల్ల‌రి న‌రేష్(Allari Naresh) అంజిగాడు అనే కీలక పాత్ర‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంజిగాడు గ్లింప్స్ కూడా యూట్యూబ్లోట్రెండ్ అవుతోంది. 

లేటెస్ట్గా నా సామిరంగ మేకర్స్..అంజిగాడి ప్రాణం ఎవరో తెలుసా..అంటూ..మిర్ణామీనన్‌(Mirna Menon) లుక్‌ రిలీజ్ చేశారు. మిర్ణామీనన్‌ ఈ మూవీలో మంగ పాత్రలో కనిపించనుంది. నెత్తిన మల్లెపూలు, చేతిలో సద్దిమూటతో వరిచేను పొలంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిర్ణామీనన్‌ రజినీకాంత్ జైలర్, అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో నటించి మెప్పించింది.

 

నా సామి రంగ ట్రైలర్‌ను జనవరి 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను  ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్‌ దక్కించుకుంది. 

 శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.