హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాలకు చెందిన పలువురు రౌడీషీటర్లకు బుధవారం హాలియా పోలీస్ స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ కేసుల్లో ఉన్న పాత నేరస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాలియా సీఐ జనార్దన్ గౌడ్, హాలియా, నిడమానూరు ఎస్సైలు దేవి రెడ్డి సతీష్ రెడ్డి, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.