మిర్యాలగూడ సూసైడ్స్​మిస్టరీ వీడింది.. మృతులది ఏపీలోని శ్రీకాకుళం

  • ఫీచర్​ఫోన్​ ఆధారంగా గుర్తింపు  

మిర్యాలగూడ , వెలుగు :  నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని మిర్యాలగూడ, కొండ్రపోలు మధ్య ఉన్న రైల్వే పట్టాలపై ఈ నెల 31న ఓ యువకుడు, వివాహిత సూసైడ్ చేసుకోగా ఆ కేసు మిస్టరీ వీడింది. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో కీ ప్యాడ్ ఫోన్ (ఫీచర్​ఫోన్​) దొరకడంతో దాని ఆధారంగా ఎస్ఐ చాలకమ్మ ఆధ్వర్యంలో  దర్యాప్తు చేపట్టారు. అందులో డేటా డిలీట్ చేసి.. సిమ్ కార్డు తీసేసి ఉండడంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి డేటా రికవరీ చేశారు.

దాని ప్రకారం..సూసైడ్ చేసుకున్న మహిళది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం తల సముద్రానికి చెందిన పోతల ఆదిలక్ష్మి(36)గా, యువకుడిని అదే మండలం మబగం గ్రామానికి చెందిన గోవింద రావు(23)గా గుర్తించారు. ఆదిలక్ష్మికి 13 ఏండ్ల కొడుకు, 12 ఏండ్ల బిడ్డ ఉంది. హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేసే గోవిందరావుతో కలిసి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. ఈ ఆత్మహత్యలకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.