వేరే పార్టోళ్లు... రైతు బంధు, కళ్యాణ లక్ష్మి తీసుకోవద్దు : ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  నల్లమోతు భాస్కర్‌రావు సంచలన కామెంట్స్ చేశారు.  ఇతర పార్టీల వారు, తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు  సీఎం కేసీఆర్ వేసిన రోడ్లపై నడవొద్దని, కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. దామరచర్ల మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు వెళ్లిన ఆయన.. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రతిపక్షఆలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చే అన్నీ పథకాలు  తీసుకుంటాం..  మా డ్యాన్స్ మేం చేస్తామంటే కుదరదని అన్నారు. మర్యాదకు మర్యాద ఇస్తానని, మర్యాద తప్పితే ఐదు నిమిషాల్లో డ్యాన్స్ వేయిస్తానంటూ ఫైరయ్యారు. నర్సాపూర్‌తోనే నాకేదో అయితదని మీరనుకుంటున్నరు కానీ మీతోని ఏమీ కాదన్నారు. దమ్ముంటే వేరే పార్టీ వాళ్లను ఇరవై పెన్షన్లు తీసుకురమ్మంటూ సవాల్ విసిరారు. భాస్కర్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.