మిర్యాలగూడ రూరల్ ఎస్సై వీఆర్‌‌కు అటాచ్

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ రూరల్‌ ఎస్సై సతీశ్ వర్మ ప్రొబేషనరీ పీరియడ్ పూర్తిచేసుకొని డ్యూటీలో చేరిన 38 రోజులకే వీఆర్‌(వెకెన్సీ రిజర్వ్)‌కు అటాచ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు. సతీశ్ వర్మ రూరల్ స్టేషన్ పరిధిలో  ఇసుక అక్రమ రవాణాకు సపోర్ట్ చేయడంతో పాటు వ్యాపారులతో కుమ్మక్కై పీడీఎస్‌ బియ్యం రవాణాకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.  

అంతేకాదు రేషన్ బియ్యం పేరిట సన్న బియ్యం పట్టుకొని కేసులు నమోదు చేయడం, ల్యాండ్ వివాదంలో  క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఎఫ్ఐఆర్ చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో వీఆర్‌‌కు అటాచ్ చేశారు.