వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ స్థానం వేరు. పొలిటికల్ అండ్ బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వెబ్ సిరిస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే.. మేకర్స్ ఈ సిరీస్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండు సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ ఉంది తాజాగా సీజన్ 3ని కూడా తీసుకువచ్చారు. కొత్త సీజన్ జులై 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. మరి ఈ సీజన్ ఎలా ఉంది? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఆడియన్స్ ఎంతవరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మీర్జాపూర్ సీజన్-3 కాలిన్ కొడుకు మున్నా అంత్యక్రియలతో మొదలవుతుంది. సీజన్ 2 ఎండ్ లో కాలిన్ భయ్యాను శరద్ శుక్లా కాపాడుతాడు. ఇక మున్నా భార్య మాధురి (ఇషా తల్వార్) ముఖ్యమంత్రి కావడంతో శరద్ శుక్లా ఆమెను కలిసి మీర్జాపూర్‌ను తిరిగి దక్కించుకునేందుకు ప్లే చేస్తాడు. కానీ, తన మామ కాలీన్ ను కాపాడిన విషయం చెప్పకుండా దాస్తాడు. మరోపక్క కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) సపోర్ట్ తో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా ఎదుగుతాడు గుడ్డు పండిట్. అతనికి రైట్ హ్యాండ్ గా గోలు (శ్వేతా త్రిపాఠి) ఉంటుంది.
మీర్జాపూర్ ను ఎలాగైనా దక్కించుకోవడం కోసం ముఖ్యమంత్రి మాధురీ యాదవ్, శరద్ శుక్లా దద్దా త్యాగి (లిల్లిపుట్ ఫరూఖీ), అతని కుమారుడు (విజయ్ వర్మ) సపోర్ట్ కోరతారు. అలా వాళ్ళందరూ గుడ్డు పండిట్ కి వ్యతిరేకంగా ఒకటవుతారు. నేరుగా గుడ్డుతో యుద్దానికి సిద్ధమవుతారు. మరి ఆ తరువాత ఎం జరిగింది? వాళ్ళందరిని నుండి మీర్జాపూర్ పీఠాన్ని గూడు కాపాడుకోగలిగాడా? ఆ కోవలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది మీర్జాపూర్ సీజన్ 3 కథ.
విశ్లేషణ:
నిజానికి మీర్జాపూర్ అంటే వైలెన్స్, బోల్డ్ సీన్స్, పొలిటికల్ సీన్స్. ఇవే ఈ సిరీస్ ను మిగతా సిరీస్ ల నుండి ప్రత్యేకంగా నిలిచేలా చేశాయి. మొదటి పార్టీ లో అదే హైలెట్ గా నిల్చింది కాబట్టి.. భారీ విజయాన్ని సాధించింది. అందుకే ఆ సీజన్ గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. కానీ, సెకండ్ పార్ట్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అనేచెప్పాలి. ఇప్పుడు మూడో సీజన్ కి కూడా అదే మైనస్ గా మారింది.
యూత్ కు కనెక్ట్ అయ్యే వైలెన్స్ ను బాగా తగ్గించేశారు. ఇక సీన్స్ లో కూడా ఎక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపించవు. కథ కూడా కత్తగా ఎం అనిపించదు. చాలా సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఎందుకో ఈ సీజన్ లో పొలిటికల్ సీన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ప్రెసెంట్ రాజకీయాల రెఫ్రెన్స్ గా అనిపిస్తుంది. ఆ విషయంలో డజపాయింట్ అవుతారు ఆడియన్స్. అంత ఎగ్జైటింగ్ గా కాకపోయినా ఒకసారి చూసేలా ఉంది.
నటీనటులు:
మీర్జాపూర్ సీజన్ 3కి ప్రధాన బలం అంటే గుడ్డు పాత్ర. ఆ పాత్రలో అలీ ఫజల్ అద్భుతంగా నటించాడు. సీజన్ మొత్తాన్ని తన భుజాలపై మోశారు. కథ, కథణం, ప్రెజెంటేషన్ కూడా అదే రేంజ్ లో ఉంది ఉంటే.. ఈ సీజన్ నెక్స్ట్ లెవల్లో ఉండేది. ఇక గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి అదరగొట్టేసింది. యాక్షన్ సీన్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. ఆమె పాత్ర చాలా మందికి నచ్చుతుంది. ఇక ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బీనా త్రిపాఠి పాత్రకు కూడా రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. కానీ, ఆమె సీన్స్ ఎక్కువగా లేకపోవడం కాస్త డిజప్పాయింట్ అనే చెప్పాలి. ఇక మిగిలిన పాత్రల్లో కనిపించిన ఈషా తల్వార్, విజయ్ వర్మ, పంకజ్ త్రిపాఠి తమ తమ పాత్రల్లో బాగానే నటించారు.
ఇక దర్శకుల విషయానికి వస్తే.. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్మీర్జాపూర్ సీజన్ 3 సిరీస్‌ను ఉన్నత స్థాయిలో తెరకెక్కించారు. కానీ, అదే స్థాయిలో కథ బలం ఉంది ఉంటే రిజల్ట్ వేరే లెవల్లో ఉండేది. సీజన్ 3పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త డిజప్పాయింట్ అనిపించడం కన్ఫర్మ్.
ఇక ఫైనల్ గా మీర్జాపూర్ సీజన్ 3 చూడొచ్చు కానీ, అంత ఎగ్జైటింగ్ గా అనిపించకపోవచ్చు.