వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ (Mirzapur) స్థానం వేరు.పొలిటికల్ అండ్ బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వెబ్ సిరిస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.అందుకే..మేకర్స్ ఈ సిరీస్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.
ఇప్పటికే రెండు సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ ఉంది. దీంతో శుక్రవారం (జూలై 5న) అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూడో సీజన్ ట్రెండింగ్‍లో టాప్ 1 ప్లేస్‍లో ఉంది.అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. అయితే, ఈ సీజన్ స్ట్రీమింగ్ విషయంలో కాస్తా డిస్సపాయింట్ అయినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..మీర్జాపూర్ సీజన్ 3లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇందులో ఎపిసోడ్ల నిడివి (రన్‍టైమ్) ఒక్కటే ఇబ్బంది పెడుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.అయితే,ఈ మూడో సీజన్ ప్రతి సీన్ ఉత్కంఠగా ఉన్నా..సాగదీత వల్ల ఆడియన్స్ లో బోర్ ఫీలింగ్ వస్తోందంటూ కొందరు పోస్ట్ చేస్తున్నారు.ఒక్కో ఎపిసోడ్ లో సుమారు 50 నిమిషాల పాటు రన్ టైం ఉంది.డైరెక్టర్స్ గుర్మీత్ సింగ్,ఆనంద్ అయ్యర్ అనవసరమైన సీన్లు తీసేసి ఉంటే సీజన్ మరింత థ్రిల్లింగ్‍గా,గ్రిప్పింగ్‍గా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి మొహంతీ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, పియూష్ పైన్యులీ, హర్షిత శేఖర్ గౌర్, రాజేశ్ తైలంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. మీర్జాపూర్ సింహాసనం కోసం ఈ మూడో సీజన్‍లోనూ పోరును మేకర్స్ చూపించారు.