
ఆదిలాబాద్టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: అభివృద్ధి, డబుల్ బెడ్రూంల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులను బీఆర్ఎస్ నాయకులు సొంతానికి వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారని మహారాష్ర్ట ఎమ్మెల్యేలు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం చలో కలె క్టరేట్ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేలాపూర్ఎమ్మెల్యే సందీప్ దుర్వే, గడ్చిరోలి ఎమ్మెల్యే దేవ్ రావు మడ్ గూజి హోలె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ జెండాను ఎగురవేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, కొత్తపల్లి శ్రీనివాస్, లోక ప్రవీణ్రెడ్డి, నాయకులు లాలా మున్న, జోగు రవి, కోట్నక విజయ్ కుమార్ , కుంరం వందన తదితరులు పాల్గొన్నారు.