- ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ఎంక్వైరీలో వెల్లడి
- పనులకు సంబంధించిన అన్ని బిల్లులున్నాయన్న చైర్మన్
లింగంపేట, వెలుగు : లింగంపేట సింగిల్విండోలో రూ.73 లక్షలకు పైగా ప్రజా ధనం దుర్వినియోగం అయినట్లు ఎంక్వైరీలో తేలడంతో డీసీఓ వసంత ఆదేశాల మేరకు బుధవారం విండో ఆపీస్లో మహాజన సభ నిర్వహించారు. లింగంపేట సింగిల్ విండో చైర్మన్, సీఈఓ సందీప్ కుమార్ నిధులు దుర్వినియోగం చేశారని డైరెక్టర్లు పై స్థాయి అధికారులకు ఏడాది కింద కంప్లైంట్ ఇచ్చారు. నిదులు దుర్వినియోగం అయినట్లు విచారణలో తేలడంతో మహాజన సభ ఏర్పాటు చేశారు.
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులుహాజరై నిధుల దుర్వినియోగంపై చైర్మన్ ను ప్రశ్నించారు. చైర్మన్ మాట్లాడుతూ.. సొసైటీ నిధులతో చేపట్టిన ప్రతి పనికి బిల్లులు ఉన్నాయని తీర్మానం లేకుండా ఎలాంటి పనులు చేయలేదని వివరించారు. కొందరు డైరెక్టర్లు దురుద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
విండో నిధుల దుర్వినియోగంపై ఆయా గ్రామాలకు చెందిన రైతులకు, విండో పాలకుల మధ్య వాదనలు జరగ్గా.. సొసైటీలో నిధులు దుర్వినియోగం జరగలేదని రైతులు చైర్మన్ కు అనుకూలంగా తీర్మానం చేశారు.