మానకొండూరు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిపై ఎంపీపీ సులోచన భర్త శ్రీనివాస్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భూమి పూజ కోసం ముహూర్తం నిర్ణయించే విషయంలో పట్టించుకోవడం లేదంటూ శ్రీనివాస్ రెడ్డి ఏఈ తిరుపతిపై వాటర్ బాటిల్ విసిరికొట్టారు. గణతంత్ర వేడుకలు అనంతరం కార్యాలయంలో ఎంపీపీ సులోచన ముందే ఇద్దరు గొడవకు దిగారు. గొడవ కాస్త పెద్దది కావడంతో మిగతా ప్రజాప్రతినిధులు వారిని అడ్డుకున్నారు. భార్య స్థానంలో భర్త పెద్దరికం చెలాయించడమే కాకుండా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించడం పట్ల ఎంపీపీ భర్త శ్రీనివాస్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.