
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ లో అపశృతి చోటుచేసుకుంది. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కార్యకర్తకు చెందిన బైక్ మహిళా కానిస్టేబుల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ పద్మజ కాలు విరిగింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
యాక్సిడెంట్ కు కారణమైన శ్రీకాంత్ అనే కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీకాంత్ బండిని స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ పద్మజను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.