జగిత్యాల జిల్లా : మెట్ పల్లి బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ పై అర్థరాత్రి నలుగురుదుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ కోసం నలుగురు వ్యక్తులు రెండు బైక్ లపై బంకుకు వచ్చారు. పెట్రోల్ పోయమని సిబ్బందిని అడిగారు. అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోయమని చెప్పడంతో బెదిరించారు. చివరకు పెట్రోల్ పోయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వమంటే బంకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
పెట్రోల్ బంకు ఆఫీస్ అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత ఫర్నిచర్ సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బంకు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. బంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం అన్ని చోట్ల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.