
నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని చెక్ పోస్టును గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో భాగంగా ఆకేరు వాగు పరివాహక గ్రామాల్లో జిల్లా ఎస్పీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయించారు.
చిన్నగూడూరు మండలంలో ఆకేరు వాగు పక్కన చెక్ పోస్టు టెంటుకు నిప్పు పెట్టడడంతో పూర్తిగా కాలిపోయింది. టెంట్ ఆనవాళ్లు కనిపించకుండా దుండగులు ఆ ప్రదేశంలో గడ్డి, ఇసుక చల్లారు. బుధవారం రాత్రి ఘటన జరిగి ఉండొచ్చని రెవెన్యూ సిబ్బంది చెబుతుండగా.. డ్యూటీలు చేయాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.