హైదరాబాద్ ORR సర్వీస్ రోడ్లో ఘోరం.. కారు ఓవర్ స్పీడ్తో బైక్ను కొట్టేసింది..

హైదరాబాద్ ORR సర్వీస్ రోడ్లో ఘోరం.. కారు ఓవర్ స్పీడ్తో బైక్ను కొట్టేసింది..

హైదరాబాద్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ORR సర్వీస్ రోడ్ చీర్యాల్ దగ్గర కారు ఓవర్ స్పీడ్తో బైక్ను కొట్టేసింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 24న రాత్రి 7:30 గంటలకు గూడూరు చంద్రశేఖర్(32), మత్స్యగిరి (27), శ్రీను(17) బైక్ పై వెళుతున్నారు. కీసర గ్రామంలోని తన బంధువుల ఇంటికి ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్ళి తిరిగి వెళుతున్నారు.

యాద్గార్‌పల్లి మీదుగా ఇంటికి వెళుతుండగా, ORR సర్వీస్ రోడ్ చీర్యాల్ సమీపంలోకి చేరుకున్న సమయంలో TS 08 JJ9549 కారు వారి పైకి దూసుకొచ్చింది. కారును డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వచ్చి మత్స్యగిరి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో.. ముగ్గురు బండి మీద నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో గూడూరు చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించగా, మత్స్యగిరి రాత్రి 9:54 గంటలకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్రీను గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.