Job Alert: పదోతరగతి ఉంటే చాలు ..మిధానిలో ఉద్యోగాలు

Job Alert: పదోతరగతి ఉంటే చాలు ..మిధానిలో ఉద్యోగాలు

అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మిశ్ర ధాతు నిగమ్(మిధాని) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

పోస్టుల సంఖ్య: 43

పోస్టులు: అసిస్టెంట్​లేవల్​ 2 (ఫిట్టర్) 07, అసిస్టెంట్ లెవల్ 2 (ఎలక్ట్రీషియన్) 04, అసిస్టెంట్ లెవల్ 2 (టర్నర్) 01, అసిస్టెంట్ లెవల్ 2(వెల్డర్) 02, అసిస్టెంట్ లెవల్ 4(మెటలర్జీ) 23, అసిస్టెంట్ లెవల్ 4(మెకానికల్) 05, అసిస్టెంట్ లెవల్ 4(సీఏడీ ఆపరేటర్) 01.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతితోపాటు ఐఐటీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 38 సంవత్సరాలు. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 25 నుంచి మే 7 వరకు