త్వరలో మిస్​ అండ్ ​మిసెస్ బ్యూటిఫుల్​ సీజన్–2​ : కిరణ్మయి అలివేలు

త్వరలో మిస్​ అండ్ ​మిసెస్ బ్యూటిఫుల్​ సీజన్–2​ :  కిరణ్మయి అలివేలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇటీవల హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్, బ్యూటిఫుల్ సక్సెస్ అయ్యిందని నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు. త్వరలోనే సీజన్–2 నిర్వహిస్తామని సోమవారం ప్రకటించారు. ఫస్ట్​సీజన్ విజేతలతో కలిసి సీజన్–2 పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కిరణ్మయి అలివేలు మాట్లాడుతూ.. “ఔత్సాహిక యువతులకు ఇది ఒక గొప్ప వేదిక. పెళ్లి ఒక ముగింపు కాదు.

జీవన ప్రయాణంలో అద్భుతమైన కొత్త ఆరంభం. మహిళల అందాన్ని మరింత గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ప్రదర్శించేందుకు ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాంను రూపొందించాం,” అని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి మహిళను ఫ్యాషన్ రంగంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు, సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.