
మాసబ్ట్యాంక్జేఎన్ఏఎఫ్ఏయూలో శుక్రవారం ‘మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ – బ్యూటిఫుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్’ ఆడిషన్స్ జరిగాయి. డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడల్స్, గృహిణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జ్యూరీ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇవ్వడంతోపాటు ర్యాంప్‌వాక్ తో సందడి చేశారు. 50 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 29న సిటీలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు.– ఫొటోగ్రాఫర్, వెలుగు