
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ని శనివారం సాయంత్రం మిస్ ఇండియా నందిని గుప్తా సందర్శించారు. ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు బొకే అందజేసి స్వాగతం పలికారు.
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ ద్వారా టెంపుల్ ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఆమెవెంట తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై సతీశ్, టూరిజం, పోలీస్, పురావస్తు, రెవెన్యూ శాఖ దేవాదాయ శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.