Miss Universe 2023: దేశానికి ప్రాతినిథ్యం వహించనున్న మిస్ దివా యూనివర్స్ విన్నర్

Miss Universe 2023: దేశానికి ప్రాతినిథ్యం వహించనున్న మిస్ దివా యూనివర్స్ విన్నర్

మిస్ దివా యూనివర్స్ కిరీటం దక్కించుకున్న 23 ఏళ్ల మోడల్ శ్వేతా శారదా ఎల్ సాల్వడార్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు. చండీగఢ్‌లో జన్మించిన శ్వేతా.. ఇటీవల ముంబైలో జరిగిన వేడుకల్లో ప్రతిష్టాత్మక మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో 15 మంది ఇతర పోటీదారులలో శ్వేత నిలవగా.. 2022 విజేత దివితా రాయ్ నుంచి ఆమె కిరీటాన్ని పొందారు.

మిస్ దివా ఫెమినా మిస్ ఇండియా గ్రూప్‌లో భాగం. మిస్ యూనివర్స్ కోసం భారతదేశ ప్రతినిధులను ఎంచుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.   

శ్వేతా శారదా గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు

  • చండీగఢ్‌కు చెందిన శ్వేతా శారదా భారతీయ మోడల్. 16 సంవత్సరాల వయస్సులో శ్వేతా తన తల్లితో ముంబైకి మకాం మార్చుకున్నారు.
  • ఫెమినా బ్యూటీ పాజెంట్స్ సమాచారం ప్రకారం, శ్వేతా.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు.
  • ఆగస్టు 27, 2023న జరిగిన మిస్ దివా పోటీల 11వ ఎడిషన్‌లో విజయం సాధించిన శ్వేతా శారదా మిస్ దివా 2023 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
  • ఆమె డాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ దీవానే, డ్యాన్స్ ప్లస్‌తో సహా అనేక రియాలిటీ షోలలో కూడా కనిపించారు.
  • ఆమె ఝలక్ దిఖ్లా జాలో కొరియోగ్రాఫర్ కూడా.

మిస్ యూనివర్స్ 2023 ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..

మిస్ యూనివర్స్ 2023 నవంబర్ 16న రాత్రి 9:00 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ఈ సంవత్సరం నెట్ వర్తీ ఫీచర్, లైవ్ బాష్‌తో భాగస్వామ్యం కానుండగా.. రెండు పోటీలను నిర్దేశించిన ఫ్లాట్ ఫారమ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. USలోని టెలిముండో స్పానిష్‌లో ఈ ఈవెంట్‌ను ప్రసారం చేయనుంది. దాంతో పాటు Roku ఛానెల్ స్ట్రీమింగ్ యాక్సెస్‌ను అందిస్తుంది. భారతదేశంలోని వీక్షకుల కోసం, భారత ప్రామాణిక కాలమానం ప్రకారం నవంబర్ 19 ఉదయం 6:30 గంటలకు మిస్ యూనివర్స్ యూట్యూబ్ ఛానెల్, X ఖాతాలో పోటీని వీక్షించవచ్చు.