నారసింహుడి సేవలో మిస్ యూనివర్స్.. ఆలయంలో పూజలు చేసిన విశ్వసుందరి

నారసింహుడి సేవలో మిస్ యూనివర్స్.. ఆలయంలో పూజలు చేసిన విశ్వసుందరి

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఇవాళ విశ్వసుందరి(మిస్ యూనివర్స్) విక్టోరియా కార్ థెయిల్విగ్ దర్శించుకున్నా రు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ ఈశాన్య దిశలో ఉన్న అఖండజ్యోతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తూర్పు రాజగోపురం నుండి త్రితల గోపురం గుండా ఆలయంలోకి చేరుకున్నారు. 

క్షేత్రపాలకుడు ఆంజనేయస్వా మిని దర్శించుకుని ముఖ మంటపంలో స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలోకి వెళ్లారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శిం చుకుని ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేయగా... ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.