న్యూఢిల్లీ: కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 ఫైనల్స్ వాయిదా పడింది. షెడ్యల్ ప్రకారం ఈ నెల 16న పూర్టో రికోలో ఈ పోటీని నిర్వహించాల్సింది. కానీ కంటెస్టెంట్స్, స్టాఫ్ తోపాటు సాధారణ ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫినాలేని పోస్ట్ పోన్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేది 90 రోజుల్లోగా ప్రకటిస్తారు. కాగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారిలో 17 మంది కంటెస్టెంట్లతోపాటు పలువురు సిబ్బందికి కరోనా సోకిందని సమాచారం. కొవిడ్ పాజిటివ్ గా తేలిన వారిలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా 2020 మానసా వారణాసి కూడా ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మానసా వారణాసికి కరోనా సోకిందన్న వార్తలపై మిస్ ఇండియా ఆర్గనైజేషన్ క్లారిటీ ఇచ్చింది. మానసకు కొవిడ్ సోకిన మాట నిజమేనని కన్ఫర్మ్ చేసింది. మానసతోపాటు పలువురు పోటీదారులకు కరోనా సోకడం వల్లే పోటీని వాయిదా వేయాలని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్ణయించిందని తెలిపింది. మానసా వారణాసికి కొవిడ్ పాజిటివ్ గా తేలిందని.. ప్రస్తుతం ప్యూర్టో రికోలో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా భారత్ కు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఇన్ స్టా పోస్టులో పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం: