పర్యాటకానికి మరింత బూస్ట్..టూరిజంను భారీగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్లాన్​

పర్యాటకానికి మరింత బూస్ట్..టూరిజంను భారీగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్లాన్​
  • హైదరాబాద్  వేదికగా మే నెలలోమిస్ వర్డల్  పోటీలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాండ్  ఇమేజ్​ని దశదిశలా చాటేందుకు మిస్​ వరల్డ్​ పోటీలను వినియోగించుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు పర్యాటక రంగానికీ ఊతమిచ్చేందుకు ఇదో  అవకాశంగా మలుచుకోవాలనే ప్లాన్​లో ఉంది.  హైదరాబాద్ లో  మే 7 నుంచి 31 వరకు మిస్  వర్డల్  పోటీలు నిర్వహించనున్నారు.

ఇందు కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోటీలకు రూ.55 కోట్లు కేటాయించింది. వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు ఈ నిధులతో సకల  సౌకర్యాలు కల్పించబోతోంది. మిగిలిన ఖర్చును మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వరల్డ్‌‌‌‌‌‌‌‌  ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌  నిర్వాహకులు భరించనున్నారు. దాదాపు 140 దేశాల నుంచి 140 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

వివిధ దేశాల నుంచి పోటీదారులతోపాటు మీడియా ప్రతినిధులు, ఆయా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిని  తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్  ఈవెంట్స్  నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం వేదికలు రెడీ  చేస్తున్నారు. 

20 పర్యాటక ప్రాంతాలపై ప్రమోషన్

మిస్  వరల్డ్  పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులకు హైదరాబాద్​, పోచంపల్లి, ఓరుగల్లు, సిరిసిల్ల , నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ కొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక, కళాత్మక ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగుళాంబ లాంటి  ప్రముఖ టెంపుల్​ సిటీస్  చూపించనునక్నారు.

అలాగే.. అమ్రాబాద్, కవ్వాల్, అనంతగిరి, లక్నవరం లాంటి  పర్యాటక స్థలాలను కూడా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో టూరిజంకు భారీగా ప్రమోషన్  లభిస్తుందని అధికారులు  చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్  ఈవెంట్స్  నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.