హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ప్రపంచ అందం

హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ప్రపంచ అందం

జూబ్లీహిల్స్ వెలుగు : మిస్​వరల్డ్– 2024 క్రిస్టినా పిజ్కోవా శుక్రవారం కేబీఆర్​ పార్కులో మెరిశారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుని మంత్రి కొండా సురేఖతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ పలువురు స్కూల్​ స్టూడెంట్లు వేసిన పెయింటింగ్స్​ను చూసి అభినందించారు.

 పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ క్రిస్టినా పిజ్కోవాను సత్కరించారు.