భారత రక్షణ వ్యవస్థలో క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కీలకమైంది.
సైన్యానికి చెందిన టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్(టీడీఈ), డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ కలయికతో 1958లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఏర్పడింది. రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం దీని ఉద్దేశం. 1983లో సమగ్ర నియంత్రణ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రాజెక్టుకు ఆద్యుడు ఎ.పి.జె.అబ్దుల్ కలాం. దేశంలోని కొన్ని ప్రభుత్వరంగ పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలల సహకారంతో డీఆర్డీఓ చేపట్టిన ఈ కార్యక్రమం 2008లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొంది. ప్రస్తుతం ఒక్కొక్క క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
స్వయం చోదక శక్తి కలిగి గాలిలో దూసుకుపోయి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను రక్షణశాఖ పరిభాషలో క్షిపణులుగా వ్యవహరిస్తారు. బాహ్య లేదా అంతర్గత వ్యవస్థల ద్వారా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే వరకు మొత్తం ప్రయాణాన్ని నియంత్రణ వ్యవస్థలో ఉండే దాన్ని నియంత్రిత క్షిపణి అంటారు. భూమి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకొని లక్ష్యాలను ఛేదించేవి బాలిస్టిక్ క్షిపణులు. తొలుత బాహ్య అంతరిక్షంలోకి స్వయం చోధక శక్తి ద్వారా చేరి, తిరిగి భూమి వాతావరణంలోకి చేరి గురుత్వాకర్షణతో అధిక వేగంతో లక్ష్యాలను ఛేదిస్తుంది.
తన ప్రయాణంలో అధిక భాగం భూమికి సమాంతరంగా కొద్ది ఎత్తులో సాగుతూ లక్ష్యాన్ని చేరుతున్న సమయంలో పైకి లేచి సూపర్సోనిక్ వేగంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి రైలు, రోడ్డు, ఫిక్సడ్ లేదా మొబైల్ లాంచర్ల నుంచి అగ్నిక్షిపణులను ప్రయోగించవచ్చు. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగలవు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. పృథ్వీ నిర్మాణం తొలిసారిగా 1983లో మొదలైంది. 1985న తొలిసారిగా దీన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. దీనిని ఐదు రూపాలుగా అభివృద్ధి చేశారు.
జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణుల కుటుంబాన్ని కె–సమూహల క్షిపణులుగా పరిగణిస్తాయి. ఇందులో ఇప్పటికే అభివృద్ధి చేసిన సాగరిక (కె15) సముద్రగర్భం నుంచి ప్రయోగించే జలాంతర్గ క్షిపణి – 1987లో మొదటిసారిగా సాగరిక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని 2008 ఫిబ్రవరి 26న సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టక్ మిసైల్‌గా ప్రయోగించారు.ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించ గల స్వల్పశ్రేణి క్షిపణి ఆకాష్. దీని పరిధి గరిష్ఠంగా 30 కి.మీ. రాంజెట్ సూత్రాన్ని తొలిసారిగా దీనిలో ఉపయోగించారు.
ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి త్రిశూల్. ఈ క్షిపణిని భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. వీటిని భుజం లేదా వాహనం ద్వారా కాని ప్రయోగించవచ్చు. ఫైర్ అండ్ ఫర్గెట్ రకానికి చెందింది. దీని పరిధి 9 కి.మీ. యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్. దీని పరిధి 3–7 కి.మీ. దీనికి థర్మల్ సైట్ లక్షణం ఉంది. ఉష్ణవాహక పదార్థాలను వేగంగా పసిగట్టగలదు. హెలికాప్టర్ నుంచి ప్రయోగించగల యుద్ధ ట్యాంక్ విధ్వంసక నాగ్ క్షిపణి. దీని పరిధి 7– 8 కి.మీ. దీనిని ధృవాస్త్ర అని కూడా పిలుస్తారు. ఇప్పటికే రుద్ర హెలికాప్టర్ నుంచి డీఆర్డీఓ దీనిని విజయవంతంగా ప్రయోగించింది.
భారత్, రష్యా అభివృద్ధి చేసిన రెండు దశల బ్రహ్మోస్ బరువు 3.9 టన్నులు. యుద్ధ నౌక, జలాంతర్గామి, మొబైల్ లాంచర్లు, నేల లేదా సముద్రం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల క్షిపణి అస్త్ర. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిసైల్ క్షిపణి. 80 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల స్వల్పశ్రేణి క్షిపణి. పరిధి 600 కి.మీ. 1000కిలోల పేలోడ్ సామర్థ్యం గలదు. 2008న నవంబర్‌లో దీన్ని పరీక్షించారు. ఇది కే15కు రూపాంతరం. టీ–72, అర్జున్ లక్షణాల కలయికతో అభివృద్ధి చేయనున్న తేలికపాటి యుద్ధ ట్యాంక్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత మొదటి పౌరవిమానం సరస్. దీని మొదటి ప్రోటోటైప్ పరీక్ష ప్రయాణం 2004 మేలో జరిగింది.
పైలెట్ రహిత టార్గెట్ విమానం. దీన్ని రిమోట్ సాయంతో నడపవచ్చు. 100 కి.మీ. వరకు రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. మానవరహిత విమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొదటి పైలట్ రహిత విమానం గంటకు 150 కి.మీ. వేగంతో 5 గంటలపాటు ప్రయాణించగలదు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికరకం యుద్ధ విమానం తేజస్. దీని లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్–1 కార్యక్రమంలో భాగంగా బెంగళూరులో 2007 ఏప్రిల్‌లో చేపట్టిన మొదటి ప్రయోగం విజయవంతమైంది.