- ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్
కూకట్పల్లి, వెలుగు: సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లొచ్చిన ఓ ఇంటర్ స్టూడెంట్ కనిపించకుండా పోయాడు. చివరిగా ‘ఈ రోజు నేను చావుని వెతుక్కుంటూ పోతున్నాను. నాకు మరో జన్మ అంటూ ఉంటే ఇదే తల్లిదండ్రులను, ఫ్రెండ్స్ ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్చేశాడు. ఏపీలోని పల్నాడు జిల్లా కేశవపల్లికి చెందిన చింతల పవన్ మణికంఠ(19) ఇంటర్ సెకండ్ఇయర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రులు కేపీహెచ్‌బీకాలనీలోని చైతన్య అకాడమీ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. స్థానిక హాస్టల్లో ఉంటూ పవన్మణికంఠ కోచింగ్ తీసుకుంటున్నాడు. సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లాడు.
మంగళవారం ఉదయం తిరిగొచ్చాడు. జేఎన్టీయూ బస్టాప్‌లో దిగి, తాను రీచ్అయినట్లు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు కాల్చేస్తే యువకుడి ఫోన్స్విచ్చాఫ్వచ్చింది. వెంటనే అతని ఫ్రెండ్స్ కు ఫోన్‌చేస్తే హాస్టల్‌కి రాలేదని చెప్పారు. మణికంట తన ఇన్స్టాగ్రామ్అకౌంట్లో ‘నేను చావుని వెతుక్కుంటూ పోతున్నాను’ అని పోస్ట్పెట్టినట్లు అతని తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న మియాపూర్‌లోని మణికంఠ బంధువులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.