రూ. 500 కే సిలిండర్ పథకానికి అర్హత కలిగి ఉండి ఎవరి పేర్లయినా మిస్సయినా ఇస్తామని పౌరసరఫరాల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. ఎవరి పేర్లయినా మిస్సయితే తగిన పత్రాలను అధికారులకు చూపి లబ్ధి పొందాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు ప్రాసెస్ చేసి తెల్లకార్డున్న వారందరికీ, మూడేండ్ల యావరేజీ ప్రాతిపదికన రూ. 500 కే సిలిండర్ ఇస్తామని చెప్పారు. 40 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు.
సబ్సిడీకి అవసరమైన పేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఇచ్చి.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఖాతాల్లో వేస్తాం.. ముందు ముందు రూ. 500 ఏజెన్సీకి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం.. త్వరలోనే తీసుకొస్తం.. అని చెప్పారు.