నేపాల్ లో కూలిన విమానం.. 22 మంది మృతి !

నేపాల్ లో ఆదివారం ఉదయం మిస్సయిన విమానం కూలిపోయిందని గుర్తించారు. ఉత్తర నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లాలో ఉన్న కోవాంగ్ గ్రామంలో విమానం శిథిలాలను గుర్తించినట్లు సమాచారం. అయితే దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి కానీ, విమానయాన సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కోవాంగ్ వద్ద విమానాన్ని గుర్తించామనే విషయాన్ని నేపాల్ రాజధాని కాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహకులు వెల్లడించారంటూ ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. 
తారా ఎయిర్ కు చెందిన విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పొఖారా విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుంది. మరో 15 నిమిషాల్లో గమ్య స్థానం (జోమ్ సొమ్ పట్టణం) చేరుకోవాల్సిన విమానం .. పత్తా లేకుండా పోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ఏటీసీతో సంబంధం కోల్పోయి, రాడార్ నుంచి మిస్ అయింది.

22 మందితో బయలుదేరి.. 

పొఖారా నుంచి జోమ్ సొమ్ కు బయలుదేరిన ఈ చిన్న విమానంలో సిబ్బంది సహా మొత్తం 22 మంది ఉన్నారు. ఇందులో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ వాసులు, ఇద్దరు జర్మన్లు ఉన్నట్లు చెబుతున్నారు. మిస్ అయిన విమానాన్ని అన్వేషించేందుకు రెండు ప్రైవేటు హెలికాప్టర్లను నేపాల్ సైన్యం రంగంలోకి దింపింది. పొఖారా పట్టణానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ముస్తాంగ్ జిల్లాలోని మనపతి హిమాల్ పర్వత ప్రాంతం వద్ద విమానం కుప్పకూలినట్లు గుర్తించారు. ఆ విమానాన్ని నడిపిన పైలట్ ప్రభాకర్ ఘిమిరె సెల్ ఫోన్ ను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) నెట్ వర్క్ తో ట్రాక్ చేయడం ద్వారా లొకేషన్ ను తెలుసుకోగలిగారు. సహాయక చర్యల నిమిత్తం వెంటనే సంఘటనా స్థలికి పోలీసులు, సైనికులు, నేపాల్ విమానయాన శాఖ సిబ్బందిని పంపారు. ప్రమాదానికి గురైన ఆ విమానంలో ఉన్న భారత ప్రయాణికుల్లో అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠి ఉన్నారని తారా ఎయిర్ ప్రకటించింది. విమానం కుప్పకూలడానికి ముందు చివరిసారిగా.. ఘోరేపానీ గ్రామానికి చెందిన సెల్ టవర్ నుంచి మిస్సయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు..

నేపాల్లో విమానం మిస్సింగ్

ఆ ఇల్లు ఏలియన్లదేనా ?!