ముగ్గురు ఇంజినీరింగ్​స్టూడెంట్స్​ మిస్సింగ్

ముగ్గురు ఇంజినీరింగ్​స్టూడెంట్స్​ మిస్సింగ్
  • ఫిర్యాదు చేసిన  గురునానక్ మేనేజ్​మెంట్, పేరెంట్స్​​ 
  • మిస్సయిన వారిలో ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి  

ఇబ్రహీంపట్నం, వెలుగు: గురునానక్​ ఇంజినీరింగ్​ కాలేజీ హాస్టల్ నుంచి వారంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీనిపై కాలేజీ మేనేజ్​మెంట్, పేరెంట్స్​ఇబ్రహీంపట్నం పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

వికారాబాద్ జిల్లా మొమిన్ పెట్ మండల్ రాంనాథ్ గూడపల్లెకు చెందిన కొత్తగడి విష్ణు (17) ఈ నెల16న, యాదాద్రి జిల్లా ఆత్మకూర్​మండలం కప్రాయిపల్లికి చెందిన కొంగరి శివాని(17) 17న, వనపర్తి జిల్లా ఎన్టీఆర్​కాలనీకి చెందిన ఉప్పల పావని(19) 20న కనిపించకుండా పోయారు. వీరంతా ఫస్టియర్​చదువుతున్నారు. ఒకే కాలేజీ నుంచి వారం వ్యవధిలో ముగ్గురు కనిపించకుండా పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వేర్వేరు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తన్నామని ఇబ్రహీంపట్నం సీఐ మధు తెలిపారు.