ఆళ్లపల్లి మండలంలో యువతి మిస్సింగ్

ఆళ్లపల్లి, వెలుగు: ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన యువతి కనిపించకుండా పోయింది. ఎస్సై రతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే సౌజన్య(22) వైరాలోని మమతా ఒకేషనల్​ కాలేజీలో ఎంఎల్​టీ కోర్సు చేస్తోంది. సోమవారం వైరా వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన సౌజన్య సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఫోన్ ​చేస్తే కలవలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్​కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆళ్లపల్లిలో ఆర్టీసీ బస్​ఎక్కి, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దిగినట్లు గుర్తించారు. తర్వాత ఆమె ఫోన్ ​స్విచ్ఛాఫ్​అయింది. చివరిగా యువతి మొబైల్​సిగ్నల్​తిప్పనపల్లి అడవుల్లో చూపించడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులకు ఫోన్ మాత్రమే​దొరికింది. ఇప్పటివరకు సౌజన్య ఆచూకీ లభించలేదు. విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.