గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన మిషన్ భగీరథ పథకం పెద్ద ఫేల్యూర్ అయ్యిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మిషన్ భగీరథ పథకం పై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో వివేక్ వెంటకస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు గ్రామస్తులు బోర్లు వేయించండని కోరారని చెప్పారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు.
నీళ్లు వచ్చే గ్రామాల్లో పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. సరిగ్గా ఫిల్టర్ కావడం కాక నీళ్లులో దుర్వాసన వస్తునట్టు ప్రజలు చెప్పారని అన్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు అధికారులతో మూడు సార్లు రివ్యూ మీటింగ్ చేశామని చెప్పారు. రివ్యూ మీటింగ్ లో ఈ స్కీంలో అన్ని పాత పైపులు వాడినట్టు తెలిసిందని నీరు సరిగ్గా ఫిల్టర్ కావడం లేదని, బ్లీచింగ్ పోడర్ ను సిరిగ్గా వేయకపోవడంతో నీళ్లలో దుర్వసన వస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. మిషన్ భగీరథను సెట్ చేయకపోతే ఈ సంవత్సరం కరువులోకి వెళ్తామని అన్నారు. ప్రభుత్వం దీన్నీ పరీక్షించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.
Also read : సూర్యాపేటలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత