బోడియాతండాలో మిషన్​ భగీరధ  నీరు వృథా

కూసుమంచి మండలంలో బోడియాతండా సమీపంలో సోమవారం మిషన్​ భగీరథ పైపులైన్​ గేట్​వాల్​ లీకై  తాగునీరు  వృథాగా పోతోంది. పాలేరు  నుంచి మహబూబాబాద్​ జిల్లాకు  సరఫరా చేసే పైపులైన్​ గేట్​వాల్​ లీక్ కావడంతో నీరు ఎగజిమ్ముతోంది. అధికారులు స్పందించి   రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. 
- కూసుమంచి,వెలుగు