పనులు ఇస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని పరారైన కీసర మండల మిషన్ భగీరథ AE రాహుల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎనమిది నెలల క్రితం కాంట్రాక్టర్ల నుండి దాదాపు రూ.15 కోట్లు తీసురకుని ఏఈ రాహుల్ పరారయ్యాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కీసర పోలీసులను ఆశ్రయించారు.
రాహుల్ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏఈ రాహుల్ ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. క్రమంలో దేశం విడిచి విదేశాలకు పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు.