మిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగుల ధ‌ర్నా

వరంగల్: అకారణంగా విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ.. వరంగల్ లో మిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నాలుగేళ్ల నుంచి తాము ఇంటింటా నీళ్లు అందించేందుకు రాత్రి, పగలు కష్టపడి పని చేస్తే కరోనా కష్టకాలంలో తమను విధుల నుంచి తొలగించడం అన్యాయం అంటూ ఫ్లకార్డులతో నిర‌స‌న చేప‌ట్టారు. వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని మిషన్ భగీరథ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. తెలిపారు. తమను ప్రభుత్వం అకారణంగా తొలగించిందని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.