
తాగునీరు వృథాగా పోతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో హైవే రోడ్డు పక్కన పైప్లైన్లీకై మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆరు రోజులుగా పైప్లైన్ లీకై నీరు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. - నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు