మండల సభలో సర్పంచ్ ఆగ్రహం
కమలాపూర్, వెలుగు : తమ గ్రామానికి 4 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఆఫీసర్లకు చెబితే పట్టించుకోవడం లేదని కమలాపూర్ మండలం శంభునిపల్లి సర్పంచ్ పెండ్యాల రవీందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కమలాపూర్ ఎంపీడీవో ఆఫీస్‌లో మండల సమావేశం ప్రారంభం కాగానే పలువులు సర్పంచ్‌లు తమ సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామానికి నీళ్లు రాకున్నా కరెంట్ బిల్లు మాత్రం రూ. 58 వేలు వచ్చిందని మండిపడ్డారు. మన ఊరు మన బడి బిల్లులు వస్తలేవని, కలెక్టర్కు, ఆఫీసర్లకు చెప్పినా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సమావేశంలో ఎంపీపీ తడక రాణి, జడ్పీటీసీ కల్యాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు పాల్గొన్నారు.