- హైకోర్టుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులు
- 249 సర్వేనంబర్నుంచి తొలగించాలంటున్న బాధితులు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాల్‌వాడ లోని 249 సర్వేనంబర్నుంచి మిషన్ భగీరథ పైపులైన్నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ఆరేండ్ల క్రితం అప్పటి అధికారులు చేసిన తప్పు ఇప్పుడు తలనొప్పిగా మారింది. బాధితుడు చుంచు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2012 మున్సిపల్మాస్టర్ప్లాన్లో లక్ష్మీ టాకీస్నుంచి గోపాల్‌వాడ, తిలక్నగర్మీదుగా సున్నంబట్టివాడ మెయిన్‌రోడ్డు వరకు 100 ఫీట్ల రోడ్డును ప్రతిపాదించారు. 2018లో మిషన్‌భగీరథ పైపులైన్ఈ మాస్టర్ ప్లాన్రోడ్డు నుంచి వేయాల్సి ఉండగా అప్పటి అధికారులు దానిపక్కనున్న 249 సర్వే నంబర్ నుంచి వేశారు.
భూయజమానులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని పోలీసులతో నిర్బంధించి పైపులైన్ నిర్మాణం పూర్తి చేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా పైపులైన్ప్లాన్ సమర్పించాలని ఆదేశించింది. దీంతో 249 సర్వే నంబర్‌నుంచి పైపులైన్వేయలేదంటూ మిషన్‌భగీరథ అధికారులు కోర్టుకు తప్పుడు రిపోర్టులు అందజేశారు. దీంతో భూయజమానులు రెవెన్యూ అధికారులతో సర్వే చేయించగా 249 సర్వేనంబర్నుంచే వేసినట్టుగా తేలింది. ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకొని భగీరథ పైపులైన్‌ను తమ భూమి నుంచి తొలగించాలని కోరుతున్నారు. లేదంటే ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. అప్పటి మున్సిపల్పాలకవర్గంలోని కీలక వ్యక్తుల భూములను కాపాడేందుకు భగీరథ అధికారులు పైపులైన్‌ను దారిమళ్లించి అడ్డంగా ఇరుక్కుపోయారు.