మహబూబాబాద్ లో లీకైన మిషన్ భగీరథ పైపు… రోడ్డుపై ట్రాఫిక్ జామ్

మిషన్ భగీరథ పైపులైన్‌ లీక్ అవడంతో నీరు అంతెత్తున ఎగిసిపడుతుంది. ఈ ఘటన మహబూబబాద్ జిల్లా గూడూరులో జరిగింది. దీంతో వరంగల్ – భద్రాచలం జాతీయ రహదారిపై నీళ్లు ఎగజిమ్మి రోడ్డు మొత్తం జలశాయంగా మారింది. రెండు గంటలపాటు నీటి ప్రవాహం ఎక్కువడా ఉండేసరికి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల మిషన్ భగీరత పైపు లైన్లు లీక్ అవడం జరుగుతూనే ఉంది. ఈ పైప్ లైన్ లలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. అయినా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడంలేదు. ప్రస్తుతం మహబూబాబాద్ గూడూరులో పైప్ లైన్ కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ ఊడిపోయింది. దీంతో 30మీటర్ల ఎత్తున నీరు ఎగజిమ్మింది అలా రెండుగంటలపాటు జరిగింది.