![మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని నిరసన.. ఖాళీ బిందెలతో చిన్న ఐనం గ్రామస్తుల ధర్నా](https://static.v6velugu.com/uploads/2023/06/Mission-Bhagiratha_5SiPmn6RL7.jpg)
దహెగాం, వెలుగు : ఏడు నెలలుగా తమ ఊరిలో మిషన్ భగీరథ నీళ్ల సప్లయ్ కాక తండ్లాడుతుంటే ఆఫీసర్లు కనీసం పట్టించుకోవడం లేదని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్న ఐనం గ్రామస్తులు మంగళవారం ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
తాగునీళ్లియ్యని సర్కారు, అధికారులుండి ఏం ప్రయోజనమంటూ రెండు గంటల పాటు ఎండలో ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. ఎంపీడీవో రాజేశ్వర్ గౌడ్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ ఇనోశ్ లతో ఫోన్లో మాట్లాడగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు. వీరికి కాంగ్రెస్ లీడర్ రావి శ్రీనివాస్ మద్దతు పలికారు.