మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని ఖాళీ బిందెలతో నిరసన

కోనరావుపేట, వెలుగు: మిషన్​భగీరథ నీళ్లు వస్తలేవని కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో జీపీ ముందు నిరసన తెలిపారు. నాలుగేండ్లుగా భగీరథ నీళ్లు రాకపోవడంతో జీపీ పాలకవర్గం తమకు బోర్​నీళ్లు పంపిణీ చేస్తోందని, ఫ్లోరైడ్​నీటితో అనారోగ్యం పాలవుతున్నామన్నారు. 

సమస్యను అధికారులకు, జీపీ పాలకవర్గానికి చెప్పినా పట్టించుకోలేదని మహిళలు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  తమ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలని కోరారు.