మిషన్ భగీరథ స్కీమ్ పెద్ద అవినీతి పథకం: ఎమ్మెల్యే వివేక్

మిషన్ భగీరథ స్కీమ్ పెద్ద అవినీతి పథకం: ఎమ్మెల్యే వివేక్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరత పథకం అతిపెద్ద అవినీతి స్కామ్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి అన్నారు. ఆదివారం చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అధికారులతో కలసి ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. 1, 2, 22 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఈ సందర్భంగా ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. సత్వరమే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. మందమర్రి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని అన్నారు. ఒక్కొక్కటిగా ప్రియారిటీ పరంగా అభివృద్ధి పనులను చేపడుతామని.. ప్రజలు కొంత ఓపిక పట్టాలని కోరారేు. మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పేరుతో వేల కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీళ్ళు మురికిగా, వాసన రావడంతో ప్రజలు తాగలేక పోతున్నారని అన్నారు. మందమర్రి మున్సిపాలిటీకి అమృత్ స్కీం కింద 30 కోట్లతో తాగునీటి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read : మణుగూరుకు 30 ఏళ్లలో ఇంత వరదలు ఎప్పుడు రాలే


మరోవైపు ఎగువన కురుస్తోన్న వర్షాలతో పాటు రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని 
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి వరద పెద్ద ఎత్తున వస్తుండటంతో అధికారులు ప్రాజెక్ట్ ఐదు గేట్లను ఎత్తి నీటిని కిందికు వదులుతున్నారు. 5 గేట్లు 5 మీటర్ల ఎత్తు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిన దిగువన వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 కాగా ప్రస్తుత నీటిమట్టం 18.6750 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్‎కు ఇన్ ఫ్లో 64.032 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 20.280 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.