మిషన్​ భగీరథ టోల్ ఫ్రీకి పెరుగుతున్న ఫిర్యాదులు నెల వ్యవధిలో 280 కంప్లైంట్స్

మిషన్​ భగీరథ టోల్ ఫ్రీకి పెరుగుతున్న ఫిర్యాదులు నెల వ్యవధిలో 280 కంప్లైంట్స్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ఎర్రమంజిల్​లోని మిషన్​భగీరథ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్18005994007కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మంత్రి సీతక్క ఆదేశాలతో గతేడాది డిసెంబర్ 23న కాల్​సెంటర్​ప్రారంభించారు. వాటర్​రాకపోవడం, లీకేజీలు, సిబ్బంది స్పందించకపోడం తదితర సమస్యలపై జనం ఈ నంబర్​కు కాల్​చేస్తున్నారు. సగటున ప్రతిరోజూ10 కాల్స్​వస్తున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. 

శనివారం వరకు మొత్తం 280 కాల్స్ రాగా ఇందులో పట్టణ ప్రాంతాల నుంచి 73,  గ్రామీణ ప్రాంతాల నుంచి 207 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో187 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. వస్తున్న కాల్స్​లో నీళ్లు రావడం లేదనే ఫిర్యాదులే అత్యధికంగా ఉంటున్నాయని వారు చెప్తున్నారు.