మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు..ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును నిలదీసిన ఎంపీటీసీ 

మల్లాపూర్ , వెలుగు :  తమ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని మల్లాపూర్​మండలం గుండంపెల్లి ఎంపీటీసీ మంజుల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును నిలదీశారు. బుధవారం ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీపీ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మంజుల మాట్లాడుతూ ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు.

సమస్యను ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. శిలాఫలకాలపై మాత్రమే పథకాలు ఉన్నాయని ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో అమలుకావడం లేదన్నారు. ఎమ్మెల్యే కలగజేసుకుని సభ్యులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు , సింగిల్ విండో చైర్మన్లు అధికారులు పాల్గొన్నారు. 

బీసీ బంధు లబ్ధిదారులను మేమే ఎంపిక చేస్తాం

కోనరావుపేట :  బీసీ బంధు లబ్ధిదారులను తామే ఎంపిక చేస్తామని కోనరావుపేట మండల సర్పంచులు పేర్కొన్నారు. బుధవారం కోనరావుపేట ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ చంద్రయ్య గౌడ్​అధ్యక్షతన జనరల్​బాడీ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 Also Read: బాధిత కుటుంబాలకు వివేక్​ పరామర్శ

దళితబంధు దుర్వినియోగంపై సభ్యుల గరం

మేడిపల్లి :  దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేసిన స్పైసీ యూనిట్‌‌‌‌‌‌‌‌లో అవకతవకలు జరిగాయని, మభ్య పెట్టి డబ్బు దుర్వినియోగం చేశారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ దొనకంటి ఉమాదేవి అధ్యక్షతన మేడిపల్లి మండల జనరల్​బాడీ మీటింగ్​ జరిగింది. కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.