ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ లో మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. పైపు పగిలి నీళ్ళు రోడ్ల మీదకు వస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా నీళ్ళు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.