మహబూబాబాద్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. భారీగా ట్రాఫిక్ జామ్

మహబూబాబాద్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. భారీగా ట్రాఫిక్ జామ్

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలో జాతీయ రహదారి పక్కనే మిషన్ భగీరధీ పైపు పగిలిపోయి నీళ్లు వృథాగాపోతున్నాయి. 20 పీట్ల ఎత్తులో వాటర్ పైకి ఎగిసిపడుతోంది. పక్కన రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. కొందరు అక్కడే సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో  రోడ్డుపై ఇరువైపులా  భారీగా  వాహనాలు నిలిచిపోయాయి.  లీకైన  నీళ్లు    పక్కనే ఉన్న కాలనీల్లోకి  వెళ్లడంతో  ఇండ్లలోని ధాన్యం బస్తాలు..వస్తువులు తడిసి పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపు నుంచి నీరు లీకేజీ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 గత ప్రభుత్వ హాయాంలో నాసిరకమైన పైపులు వేయడంవల్ల పైపులైన్లు ఎక్కడికిక్కడ లీకేజీలు ఆవుతున్నాయి. లీకేజీలు జరిగిన ప్రాంతంలో  నీరంతా రోడ్లపైకి రావడంతో చెత్త, చెదారం చేరి, జమ్ము పెరిగి, బురద నీరుగా మారుతుంది. తిరిగి అదే నీరంతా పైపుల్లోకి చేరుతుంది. కలుషితమైన నీరంతా ఇంటింటికి వెళ్ళే నల్లా నీటిలో కలవడంతో, ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు