మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం

వరంగల్ జిల్లా ఖానాపూర్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. వరి ధాన్యాన్ని రైతులు నేషనల్ హైవేపై ఆరుబెట్టారు. నిన్న రాత్రి భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావటంతో ధాన్యం మొత్తం తడిసింది. నీటి ఉధృతికి ధాన్యం కొట్టుకుపోయింది.

సుమారు 10 ఎకరాలకుపైగా ధాన్యాన్ని రైతులు రోడ్డుపై ఆరబోశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని రైతులు రోడ్డుపై బైఠాయించారు.